- Advertisement -
పహల్గామ్ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సింధూర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మేరా భారత్ మహాన్, జైహింద్ అంటూ అందరూ ట్వీట్ లు చేస్తున్నారు.ఆపరేషన్ సింధూర్‌పై లోకసభలోని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ స్పందించారు. మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా జై హింద్ అంటూ రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.
పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు సింధూర్ అని నామకరణం చేసినట్టు తెలుస్తుంది.
Proud of our Armed Forces. Jai Hind!
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025
- Advertisement -

