MNREGA ఒక పథకం కాదు.. ఒక సంస్కరణ!

5
- Advertisement -

 ఉపాధిహామీ పథకం (MNREGA) ఒక సాధారణ సంక్షేమ పథకం కాదని, ఇది దేశంలోని పేదలకు గౌరవంతో కూడిన జీవనాధారాన్ని కల్పించిన ఒక గొప్ప సంస్కరణ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ పేదలకు కనీస కూలీ హక్కుగా అందుతుందని ఆయన స్పష్టం చేశారు.

MNREGA ఒక డైరెక్ట్ రైట్ బేస్డ్ పథకం అని, ప్రజలకు చట్టబద్ధమైన హక్కుగా ఉపాధి కల్పిస్తుందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అయితే ఈ హక్కును మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి, పథకాన్ని నెమ్మదిగా తీసేసే ప్రయత్నం చేస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న తాజా నిర్ణయాల వల్ల పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు.

మోడీ ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను క్రమంగా నీరుగారుస్తోందని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాక్కుంటోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. సంబంధిత మంత్రిని కూడా సంప్రదించకుండా ప్రధాని కార్యాలయం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటోందన్న సమాచారం కలవరపెడుతోందని తెలిపారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో నడుస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది తీవ్ర ప్రమాదమని హెచ్చరించారు. పేదల హక్కులను తొలగించి, అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చడానికే ఈ చర్యలన్నీ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. MNREGAను బలహీనపరచడం దేశ భవిష్యత్తును బలహీనపరచడమేనని ఆయన స్పష్టం చేశారు.

Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

- Advertisement -