బుక్ లీక్ వివాదంపై రాహుల్ గాంధీ

4
- Advertisement -

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే రాసిన ప్రచురితం కాకున్న ‘మెమాయర్’ కాపీని మీడియాకు చూపిస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. నరవణే పుస్తకానికి సంబంధించి కొనసాగుతున్న వివాదంపై స్పందించిన ఆయన, తాను మాజీ ఆర్మీ చీఫ్ మాటలనే నమ్ముతున్నానని స్పష్టం చేశారు.

ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెబుతున్నారు. ఒకరు ఎం.ఎం. నరవణే అయితే, మరొకరు పెంగ్విన్ ప్రచురణ సంస్థ. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెప్పారని నేను అనుకోవడం లేదు. నేను నరవణే గారినే నమ్ముతున్నాను అని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు.

2023లో నరవణే చేసిన ఓ ట్వీట్‌ను ప్రస్తావించిన రాహుల్ గాంధీ, అందులో తన కొత్త పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ గురించి లింక్‌ను షేర్ చేశారని గుర్తుచేశారు. “నరవణే గారు ‘నా పుస్తకానికి లింక్‌ను ఫాలో అవ్వండి’ అని ట్వీట్ చేశారు. అంటే పుస్తకం ఉందన్న మాట. కానీ పెంగ్విన్ మాత్రం ఆ పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని చెబుతోంది. అయితే ఆ పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది” అని అన్నారు.

Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్‌

నరవణే పుస్తకంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు భారత ప్రభుత్వం, ప్రధాని మోదీకి అసౌకర్యంగా ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నేను పెంగ్విన్ కంటే నరవణే గారినే నమ్ముతాను. మీరు ఎవరి మాట నమ్ముతారు? మాజీ ఆర్మీ చీఫ్ చెప్పిందే నిజమా, లేక ప్రచురణ సంస్థదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

- Advertisement -