రాహుల్‌ రాజీనామా.. కొత్త చీఫ్‌ను ఎన్నుకోండి..!

347
- Advertisement -

ఇటీవల జరిగిన లోక్‌సభ కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించినా రాహుల్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా తన రాజీనామాను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Rahul Gandhi

‘కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేయడం గర్వంగా ఉంది. ఈ దేశ ప్రజలు, కాంగ్రెస్‌ నేతల ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు.

ఈ రోజు పార్ల‌మెంట్‌లో మీడియా ప్ర‌తినిధుల‌తో రాహుల్‌ మాట్లాడుతూ.. పార్టీయే తొంద‌ర‌గా కొత్త అధ్య‌క్షుడిని ఎన్నుకోవాల‌ని.. ఎటువంటి జాప్యం చేయ‌కుండా పార్టీ చీఫ్‌ను ఎంపిక చేయాల‌ని రాహుల్ తెలిపారు. తాను అధ్య‌క్ష ప‌ద‌వికి ఇప్ప‌టికే రాజీనామా చేశాన‌ని, ఇక పార్టీ చీఫ్ ఎంపిక ప్ర‌క్రియతో త‌న‌కు సంబంధంలేద‌న్నారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ వీలైనంత త్వ‌ర‌గా స‌మావేశం కావాల‌ని, కొత్త చీఫ్ గురించి త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని రాహుల్ వెల్ల‌డించారు.

- Advertisement -