చింతమడక సర్పంచ్‌కు సీఎం కేసీఆర్‌ ఫోన్‌

441
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ త్వరలో తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే హరీష్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా తాజాగా చింతమడక సర్పంచ్‌కు ఫోన్ చేశారు సీఎం కేసీఆర్.

గ్రామంలోని సమస్యలన్నింటిపై నివేదిక రూపొందించాలని సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి సూచించారు సీఎం. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని సర్పంచ్‌తో అన్నారు. సీఎం కేసీఆర్‌ ఫోన్‌తో ఆనందం వ్యక్తం చేసిన సర్పంచ్‌ గ్రామసమస్యలపై సమగ్ర నివేదిక రూపొందిస్తామని చెప్పారు.

చింతమడక పర్యటన సందర్భంగా గ్రామస్తులతో కలిసి సహపంక్తి బోజనం చేయనున్నారు సీఎం. గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయాన్ని సందర్శిస్తారు. త్రాగు నీటి సౌకర్యం ,కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చింతమడక గ్రామంలో ఉన్న చెరువులు, కుంటల కాలువలను అనుసంధానం చేయనున్నారు.

- Advertisement -