రాహుల్ గాంధీ అసలు పేరేంటో తెలుసా..!

302
swamy rahul
- Advertisement -

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసలు పేరు బయటపెట్టారు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి. రాహుల్ గాంధీ అసలు పేరుని సర్టిఫికెట్‌తో సహా బయటపెట్టారు. కేంబ్రిడ్జి సర్టిఫికెట్ ప్రకారం రాహుల్ ఎకనమిక్స్‌లో ఫెయిలయ్యారని… మార్కుల లిస్ట్‌ను ట్వీట్ చేశారు.

కేంబ్రిడ్జ్ సర్టిఫికెట్ ప్రకారం రాహుల్ అసలు పేరు రౌల్ విన్సీ అని స్వామి తెలిపారు. నేషనల్ ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీలో రాహుల్ ఫెయిలయ్యారని స్వామి చెప్పారు. రాహుల్ గాంధీకి నాలుగు పాస్‌పోర్టులు ఉన్నాయని, ఒక దానిలో రాహుల్ విన్సీ అని పేరుందని ఇటీవలే సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. ఆయనకు జంధ్యం ఎలా ధరించాలో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. తాజాగా సర్టిఫికెట్‌తో సహా రాహుల్ అసలు బయటపెట్టారు స్వామి.

అమేథీ నుంచి రాహుల్ ప్రత్యర్థిగా బరిలో దిగుతున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతల విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. స్మృతి అసలు డీగ్రీనే చేయలేదని కానీ నామినేషన్‌ పత్రంలో డిగ్రీ చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుండగా రాహుల్ అసలు పేరు బయటపెట్టి కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లో నెట్టింది.

- Advertisement -