సీఈసీ నియామకంపై రాహుల్ లేఖ

3
- Advertisement -

సీఈసీ ఎంపిక ప్ర‌క్రియ‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉండాల‌ని, కానీ చీఫ్ జ‌స్టిస్ లేకుండానే హ‌డావుడిగా సీఈసీ పేరును ప్ర‌కటించడం సరికాదని మండిపడ్డారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు లేఖ రాసిన రాహుల్…ప్ర‌ధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్ర‌క్రియ‌లో అమ‌ర్యాద‌పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోపించారు.

నియామ‌క ప్యాన‌ల్ నుంచి సీజేఐని తొల‌గించ‌డం వ‌ల్ల కోట్లాది మంది ఓట‌ర్ల ఆందోళ‌న‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మార్చిన‌ట్లు రాహుల్ ఆరోపించారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కాపాడ‌డం ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న బాధ్య‌త అని, ప్ర‌భుత్వం దీనికి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని రాహుల్ పేర్కొన్నారు.

కొత్త చీఫ్ ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌గా జ్ఞానేశ్వ‌ర్ కుమార్‌ను కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన విష‌యం తెలిసిందే.

 

Also Read:తెలంగాణ బిల్లు పాసై 11 ఏండ్లు

- Advertisement -