- Advertisement -
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్పటికే రాష్ట్రంలోని గ్రూపు రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగిన రాహుల్…అసంతృప్తులను బుజ్జగించారు. రాహుల్ సమావేశం తర్వాత అసంతృప్తులు కాస్త మెత్తబడ్డారు.
ఇక కాంగ్రెస్ నేతలతో సమావేశం సందర్భంగా త్వరలోనే తెలంగాణకు వస్తానని తెలిపారు రాహుల్. ఇచ్చిన మాట ప్రకారం మే 6,7 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6వ తేదీన వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో జరగనున్న భారీ బహిరంగసభకు హాజరుకానున్నారు రాహుల్ .
7 వ తేదీన బోయిన్ పల్లిలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొంటారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలు, రైతులతో రాహుల్ ముఖా ముఖి నిర్వహించనున్నారు.
- Advertisement -