- Advertisement -
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ప్రశ్నలు సంధించనున్నారు.
వాస్తవానికి ఈ నెల 2న రాహుల్ ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉండగా విదేశీ పర్యటనలో ఉండటంతో ఇవాళ్టికి వాయిదా పడింది. ఇక ఈనెల 23న ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది.
ఈడీ నోటీసుల నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాహుల్ ఈడీ ముందు హాజరయినప్పటి నుంచి ముగిసే వరకు అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనుంది.
- Advertisement -