మరోసారి పప్పులో కాలేసిన రాహుల్‌…

246
rahul
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేశారు. తల్కటోరా స్టేడియంలో జరిగిన ఓబీసీ సమ్మేళన్‌లో మాట్లాడిన రాహుల్‌…బీజేపీ,ఆరెస్సెస్‌లపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బీజేపీ-ఆరెస్సెస్‌ దేశాన్ని విభజిస్తున్నాయని..ఓబీసీల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

అయితే బీజేపీ,ఆరెస్సెస్‌లను విమర్శించే పనిలో రాహుల్ చెప్పిన కథ నవ్వులు తెప్పిస్తోంది. కోకాకోలా సంస్థను ఎవరు స్థాపించారో తెలుసా? అంటూ ప్రశ్నించిన రాహుల్‌… అమెరికాలో షికంజీ (నిమ్మరసం) అమ్ముతూ అమెరికన్ ఫార్మసిస్ట్ జాన్ పెంబర్టన్ 1886లో సోడా కలిపిన ద్రావకాన్ని అమ్మడం ప్రారంభించారని… ఆ తర్వాత అది కోలా డ్రింక్ గా ప్రఖ్యాతిగాంచిందని తెలిపారు. ఆ తర్వాత అతను కనిపెట్టిన డ్రింక్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు.

1940లో రిచర్డ్, మౌరీస్ మెక్ డొనాల్డ్ లు కాలిఫోర్నియాలో ఒక హాట్ డాగ్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారని, ఆ తర్వాత అది మెక్ డొనాల్డ్స్ గా ప్రఖ్యాతిగాంచిందని చెప్పారు. ఫోర్డ్ కంపెనీని స్థాపించి ఫోర్డ్ ఒక మెకానిక్ అని తెలిపారు.

అయితే రాహుల్ చెప్పినట్టు కోకా కోలాను ఏర్పాటు చేసిన జాన్ పెంబర్టన్ తాజా నిమ్మరసం అమ్ముకునే వాడు కాదు. పెంబర్టన్ మత్తు మందుకు బానిస. కోకా చెట్ల నుంచి తీసిన సిరప్ లాంటి ద్రవాన్ని కార్బోనేటెడ్ వాటర్, కోలా నట్స్‌తో కలిపి కోకా కోలాను రూపొందించాడు. అలాగే మెక్‌డొనాల్డ్స్‌ను ఏర్పాటు చేసింది రిచర్డ్అండ్ మౌరైస్ అనే అన్నదమ్ములు. వీరు తర్వాత దాన్ని రే క్రోక్‌కి విక్రయించారు. రే క్రోక్ మిల్క్‌షేక్‌లను అమ్మేవాడు.

ఫోర్డ్‌ను మెకానిక్ ఏర్పాటు చేశాడని చెప్పారు. కానీ తొలి కారును రూపొందించిన హెన్రీ ఫోర్డ్ 11 మందితో కలిసి దీన్ని ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పినట్టు బెంజిని ప్రారంభించింది కూడా మెకానిక్ కాదు.

- Advertisement -