నాని నోటీసులపై స్పందించిన శ్రీరెడ్డి…

227
Sri Reddy nani

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్ అంశంతో పెను దుమారాన్ని రేపిన నటి శ్రీరెడ్డి. హీరో నానితో సహా పలువురిపై బహిరంగ విమర్శలు చేసిన శ్రీరెడ్డికి నోటీసులు పంపించాడు నాని. సోషల్‌మీడియాలో శ్రీరెడ్డి తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ..తన పరువుకు భంగం కలిగిస్తుందని నాని న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించాడు. ఈ నేపథ్యంలో నాని నోటీసులకు స్పందించింది శ్రీరెడ్డి.

నాని తనను శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది. తనను ఎలా వాడుకున్నాడో, ఇప్పుడు అవకాశాలు రాకుండా ఎలా అడ్డుకుంటున్నాడో స్పష్టంగా ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొంది.

అంతకముందు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న శ్రీరెడ్డికి నోటీసులు పంపిన నాని ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. వారు నాపై చేసే వ్యాఖ్యలకు నేను స్పందించను. వారు నా నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని ఇచ్చేది లేదు. వారిపై న్యాయపరమైన చర్యలకు దిగుతున్నా. ఆ వ్యక్తిపై పరువు నష్టం కేసును ఫైల్ చేసి లీగల్ నోటీసులు పంపానని తెలిపాడు.

sri reddy