Rahul Gandhi:లండన్‌కు రాహుల్‌

6
- Advertisement -

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లండన్‌కు బయలుదేరారు. అనంతరం ఆయన జర్మనీ పర్యటనకు కూడా వెళ్లనున్నారు. తెల్లవారుజామున సుమారు 3:20 గంటలకు న్యూఢిల్లీ ఐజీఐ విమానాశ్రయం నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం BA-142లో రాహుల్ గాంధీ లండన్‌కు ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి ఆయన జర్మనీకి వెళ్లనుండగా, డిసెంబర్ 17న బెర్లిన్‌లో జర్మన్ పార్లమెంట్ సభ్యులు మరియు భారతీయ వలసదారులను కలుసుకునే కార్యక్రమం షెడ్యూల్ అయింది.

రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సమయంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనను ‘విదేశ్ నాయక్’ (విదేశీ పర్యటనల నాయకుడు), ‘పర్యటనల నాయకుడు’ అంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ ప్రతినిధి షెహ్‌జాద్ పూనావల్లా మాట్లాడుతూ, డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగుతున్న సమయంలోనే రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకు జర్మనీలో ఉండడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

ఈ మేరకు పూనావల్లా ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ, “మరోసారి విదేశ్ నాయక్ తన పని తాను చేస్తున్నాడు. పార్లమెంట్ సమావేశాలు 19వ తేదీ వరకు ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ డిసెంబర్ 15 నుంచి 20 వరకు జర్మనీకి వెళ్తున్నారు. ఆయన ప్రతిపక్ష నేత కాదు, పర్యటనల నాయకుడు. బిహార్ ఎన్నికల సమయంలో కూడా ఆయన విదేశాల్లో ఉండి, ఆ తర్వాత జంగిల్ సఫారీకి వెళ్లారు” అని విమర్శించారు.

Also Read:ఆంధ్ర జలదోపిడిపై బీఆర్ఎస్ పోరుబాట

దీనిపై రాహుల్ సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ  ఘాటుగా స్పందించారు. మోదీ తన పని సమయంలో సగానికి పైగా విదేశాల్లోనే గడుపుతుంటే, ప్రతిపక్ష నేత విదేశాలకు వెళ్తే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అంటూ బీజేపీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

- Advertisement -