భారత్ జోడో యాత్రలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల గుండా యాత్ర నిర్వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాజాగా రాజస్థాన్ నాటి యాత్ర విశేషాలతో కూడిన ఫన్ చాట్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో కర్లీ టేల్స్ ప్రతినిధి కామియా జానీతో చేసిన ఫన్ని చాట్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా కామియా రాహుల్ ఆహారపు అలవాట్లు అడగ్గా…రాహుల్ స్పందిస్తూ నేను నాన్ వేజిటేరియన్ అని బదులిచ్చారు.
అంతే కాదు.. జోడోయాత్రలో భాగంగా ఎన్నో రాష్ట్రాల వంటకాలను రుచి చూశాను. ముఖ్యంగా తెలంగాణ వంటకాలు నాకు కాస్త ఘాటుగా అనిపించాయి. అక్కడ కారం కాస్త ఎక్కువ. నేను అంత తీనలేను. కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా డైట్ పాటిస్తానని తెలిపారు. బఠానీ, పనసపండు మాత్రం అస్సలు నచ్చవు. ఇంకా చికెన్ టిక్కా, సీఖ్ కబాబ్, ఆమ్లెట్ నాఫేవరెట్ వీటన్నింటితో పాటు రోజు ఉదయం కాఫీ లేనిదే…రోజు నడవదు అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి…