రాహుల్‌కి పిల్లలు పుట్టరు..వివాదాస్పద కామెంట్స్

27
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత,ఎంపీ నళిన్ కుమార్. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని..ఇదే విషయాన్ని తమ ఎమ్మెల్సీ మంజునాథ్ తనతో చెప్పారని తెలిపారు.

నళిన్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీలో అందరికీ ఉన్నట్టుగా నళిన్ కుమార్‌కు కూడా తీవ్రమైన మానసిక వ్యాధి ఉందని..కాబట్టి త్వరగా కోలుకో బీజేపీ అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. బీజేపీ సర్కస్‌లో కటీల్ ఒక జోకర్..ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

కటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో స్థానిక సమస్యల గురించి బీజేపీ కార్యకర్తలు మాట్లాడిన సందర్భంలో రోడ్ల సమస్యలు,మురుగునీటి సమస్యలు అంటూ మాట్లాడటం మానేయండి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు … ‘లవ్ జీహాద్’ వంటి విషయలపై ఫోకస్ పెట్టాలని మాట్లాడి చిక్కుల్లో పడ్డారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -