సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఉన్న రాజకీయ బంధాన్ని, ఐక్యతను చాటిచెప్తూ రాహుల్ గాంధీ ఒక పవర్‌ఫుల్ సందేశాన్ని పంచుకున్నారు.
దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం చేకూర్చడం కోసం తామిద్దరం కలిసికట్టుగా ముందడుగు వేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.. అఖిలేష్ యాదవ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
Also Read:డిజిటల్ ఇండియా..11 ఏళ్ల ప్రస్థానం!
మనమిద్దరం కలిసి దేశంలో సామాజిక న్యాయం కోసం పూనిన సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం. రాజ్యాంగ రక్షణ, సమాజంలో సమానత్వం కోసం సాగుతున్న ఈ పోరాటంలో మన ఐక్యత ఇలాగే కొనసాగుతుంది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై మరియు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ‘ఇండియా’ కూటమి తరఫున ఉమ్మడిగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఇరు పార్టీల నేతలు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

