తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజు ముగిసింది. గురువారం 26 కిలో మీటర్ల మేర రాహుల్ పాదయాత్ర కొనసాగింది. మూడు రోజుల విరామం తర్వాత గురువారం రాహుల్ తన పాదయాత్రను పున:ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. రోడ్డు మార్గాన మక్తల్ చేరుకున్నారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు
ఉత్సాహ భరితంగా సాగిన జోడో యాత్రలో రాహుల్ వెంట వేలాదిగా ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు నడిచారు. రాహుల్ పాద్రయాత్రలో విద్వేషం చోడో.. భారత్ జోడో నినాదాలు మార్మోగాయి. మతతత్వ బీజేపీ కి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాహుల్ రాత్రికి ఎలిగండ్లలో బస చేస్తారు. శుక్రవారం ఎలిగండ్ల క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. రేపు భోజన విరామంలో చేనేత కార్మికులు, పొడు రైతులతో భేటి కానున్నారు.
ఇవి కూడా చదవండి