రైతులను బానిసలుగా మార్చేందుకే వ్యవసాయబిల్లు: రాహుల్

192
rahul gandhi

రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా చేసేందుకే కేంద్రం వ్యవసాయ బిల్లును తీసుకొచ్చిందన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. రైతు వ్య‌తిరేక వ్య‌వ‌సాయ బిల్లుల విష‌యంలో ప్ర‌భుత్వం ప్రయత్నాన్ని తాము సఫలం కానివ్వబోమని రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు.

కేంద్రం రైతు వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న‌ద‌ని…. రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చాల‌ని కేంద్రం భావిస్తుందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్ర‌తిపాదిస్తున్న చ‌ట్టాల‌తో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు క‌న‌మ‌రుగ‌వుతాయ‌ని, వ్య‌వ‌సాయ మార్కెట్ల‌ను నాశనం చేసిన తర్వాత రైతులకు మద్దతు ధర ఎలా లభిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.