ఆగస్టు 10కి 20 లక్షల కరోనా కేసులు: రాహుల్

270
rahul
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 10 లక్షలు దాటిన సంగతి తెలిసిందే.ఇక కరోనా నేపథ్యంలో పలుమార్లు కేంద్రానికి సూచనలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ….దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇలాగే కంటిన్యూ అయితే ఆగ‌స్టు 10లోపు 20 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

క‌రోనా క‌ట్టడిపై కేంద్రం దృష్టిసారించాలని నిర్మాణాత్మ‌క‌మైన‌, ప్ర‌ణాళికబ‌ద్ధమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. దేశంలో నిన్న ఒక్క‌రోజే 32,695 పాజిటివ్ కేసులు న‌మోదైన నేప‌థ్యంలో ఆయ‌న ఈ హెచ్చ‌రిక చేశారు.

గురువారం ఉద‌యం నాటికి దేశంలో క‌రోనా కేసుల సంఖ్య‌ 9,68,876కు చేరింది. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 24,915 మంది మ‌ర‌ణించ‌గా, 6,12,815 మంది కోలుకున్నారు. మ‌రో 3,31,146 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

- Advertisement -