బిగ్‌ బాస్‌ విన్నర్‌గా రాహుల్‌..?

248
rahul-sipligunj
- Advertisement -

కింగ్ నాగార్జున హోస్ట్‌గా జూలై 21 ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఆదివారం (నవంబర్ 03)తో ముగియనుంది. 17 కంటెస్టెంట్స్.. 105 రోజులు.. హోరా హోరీగా సాగిన బిగ్ బాస్ సీజన్ 3 నాటితో 105వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.. విన్నర్ ఎవరన్నది ఉత్కంఠకు మరో కొన్ని గంటల్లో తెరపడనుంది. అయితే విన్నర్‌ ఎవరన్నది ముందే తెలిపోయినట్లు సమాచరం.

ఈ సీజన్ విజేత శ్రీముఖి అవుతుందని అందరూ కూడా అనుకోగా.. ఊహించని విధంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్, సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖి సొంతం. అయితే అనూహ్యంగా విజయం రాహుల్‌ని వరించింది. సీజన్ విన్నర్‌గా ట్రోఫీని అందుకున్నాడు.

bigg-boss

మొదటి రెండు సీజన్లు శివబాలాజీ, కౌశల్ మందా విజేతలుగా నిలవగా.. మూడో సీజన్‌లోనైనా లేడీస్‌కు ఛాన్స్ దక్కుతుందని భావించారు. ఆమె ఫ్యాన్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ చివరికి వచ్చేసారి శ్రీముఖి గ్రాఫ్ ఒక్కసారిగా తగ్గిపోతే.. రాహుల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఫైనల్ రేసులో రన్నరప్‌గా అవుతాడని అనుకున్న రాహుల్ టైటిల్ సొంతం చేసుకోగా.. శ్రీముఖి రెండు పర్సెంట్ ఓట్లు తేడాతో రన్నరప్‌గా నిలిచినట్లు సమాచారం.

ఇక వరుణ్ సందేశ్ మూడో స్థానంలో.. బాబా భాస్కర్ నాలుగో స్థానంలో.. అలీ రెజా ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదగా రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ ట్రోఫీ, రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్‌ను అందుకోనున్నాడు. ఆదివారం సాయంత్రం 6.30 నుంచి ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది.

- Advertisement -