నటుడిగా మారిన ఎఆర్‌ రెహమాన్..‌

322
a r rahaman
- Advertisement -

దక్షిణాది సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఎటువంటి హిట్స్ ఇచ్చాడో మనకు తెలుసు. ఆయన పాటల వల్లే ఆయా సినిమాలు ఎంతగానో హిట్టయిన విషయం విదితమే.తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపించిన సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ఎ.ఆర్‌.రెహమాన్‌ ఇప్పుడు నటుడిగా మారుతున్నారు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు. మలయాళ సూపర్‌ సార్ట్‌ మోహన్‌లాల్‌. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ హీరోగా ‘ఆరట్టు’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎ.ఆర్‌.రెహ్మాన్‌ అతిథి పాత్రలో నటించారు.

‘మ్యూజిక్‌ మాస్ట్రో రెహ్మాన్‌తో అరుదైన, మరచిపోలని అనుభవం అరట్టు కోసం షూటింగ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అంటూ దర్శకుడు ఉన్నికృష్ణన్‌, రెహ్మాన్‌లతో ఉన్న ఫొటోను మోహన్‌లాల్‌ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఈ సినిమాలో శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్‌. యాక్షన్‌, కామెడీ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది.

- Advertisement -