TDP:రఘురామ టీడీపీ నుంచే..కన్ఫర్మ్?

25
- Advertisement -

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా గెలుపొందిన ఆయన ఆ తరువాత వైసీపీతో విభేదిస్తూ వచ్చారు. పార్టీలో కొనసాగుతున్నప్పటికీ రెబల్ నేతగా వైసీపీపై తిరుగుబాటు వ్యక్తం చేస్తూ వచ్చారు. వైఎస్ జగన్ పాలన విధానంపై రఘురామ చేసే వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంటాయి. రాజధాని విషయంలోనూ, పాలన వైఖరిలోనూ, జగన్ అక్రమస్తుల విషయంలోనూ ఇలా ప్రతి విషయంలోనూ రఘురామ చేసే వ్యంగ్యస్త్రాలు వైసీపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే టీడీపీ నేతల విషయంలో ఏ స్థాయిలో ఫైర్ అవుతారో.. అంతే స్థాయిలో రఘురామ విషయంలో ఫైర్ అవుతుంటారు వైసీపీ నేతలు. .

ఇక ప్రస్తుతం రెబల్ వైసీపీ నేతగా ఉన్నందున ఈసారి ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. దాంతో రఘురామ ఏ పార్టీలో చేరతారనేది ఆద్యంతం చర్చనీయాంశంగా ఉంటూ వస్తోంది. గత కొన్నాళ్లుగా డిల్లీలో బీజేపీ అగ్రనేతలతో రఘురామ సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు దాంతో ఆయన బీజేపీలో చేరడం కన్ఫర్మ్ అని భావించారంతా కానీ అలా జరగలేదు. ఇక జనసేన విషయంలో కూడా ఆయన సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు.

ఒకానొక సందర్భంలో జనసేనలో చేరడం పక్కా అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక తాజాగా టీడీపీలో చేరేందుకు రఘురామ మార్గం సుముఖం చేసుకుంటున్నారని వినికిడి. టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారట. అయితే నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించే విషయంలో చంద్రబాబు ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని సమాచారం. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రఘురామ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. మరి ఏపీ రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలిచే రఘురామ చివరికి ఏ పార్టీ గూటికి చేరతాడో చూడాలి.

Also Read:అరచేతుల్లో చెమటలు వస్తే..యమ డేంజర్!

- Advertisement -