- Advertisement -
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఇవాళ ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న రాఘవేంద్ర రావు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాఘవేంద్రరావు …సీఎం కేసీఆర్ యాదాద్రి దేవస్థానాన్ని మహాద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు. ఆయనకు అంతా మంచే జరగాలని…తాను కొత్తగా సినిమా రూపొందించే ముందు, అదేవింధంగా సినిమా విడుదల సమయంలో స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. పూర్తి వినోదభరితమైన ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమా నేడు విడుదలయిందన్నారు.
- Advertisement -