IMD:రాగల మూడు రోజులు వడగళ్ల వానలు..ఆరెంజ్ అలెర్ట్

30
- Advertisement -

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎండలు మండిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడటంతో ఒక్కసారిగా వాతవరణం మారిపోయింది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలుల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ పలు జిల్లాలో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Also Read: టీటీడీ రూ.300 దర్శన టికెట్స్ రిలీజ్..

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు నిర్మల్ నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో, గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి వడగళ్ల వానలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

Also Read: మే జూన్‌లోని ఈ తేదీలు చాలా ముఖ్యం

- Advertisement -