“రాగల 24గంటల్లో” ట్రైలర్..

564
Eesha-Rebba
- Advertisement -

ప్రముఖ తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా రాగల 24 గంటల్లో. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను లెజెండరీ దర్శకుడు కే రాఘవేంద్రరావు విడుదల చేసారు. ట్రైలర్ చూసిన తర్వాత దర్శక నిర్మాతలను ఆయన ప్రశంసించారు. ఆకట్టుకునే విధంగా ఉందని.. తనకు ట్రైలర్ చాలా బాగా నచ్చిందని తెలిపారు.

శ్రీనివాస్ రెడ్డి రాగల 24 గంటల్లో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సత్యదేవ్, తమిళ నటుడు శ్రీరామ్ మరియు ముస్కాన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. రాగల 24 గంటల్లో సినిమాను శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ క్రియేషన్స్ సంస్థలో శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్నారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు.

https://youtu.be/3w00u4_mSPE

- Advertisement -