రాధికా ఆప్టే … ఈ పేరు వింటే చాలు .. ఆమె రేపే సంచలనాలే గుర్తుకు వస్తాయి.తెలుగు, తమిళ్, హిందీ, మరాఠి వంటి భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ…కొంతకాలంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. న్యూడ్, సెమి న్యూడ్ అంటూ హంగామా క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కమర్షియల్ హీరోయిన్ గా అంత పెద్దగా సక్సెస్ కాలేకపోయిన రాధికా… బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలకు పెద్దపీట వేసి కుర్రకారును షేక్ చేసింది.
ఇటీవలే ‘పర్చెడ్’, ‘మ్యాడ్లి’ అనే సినిమాలో రాధిక నటనతో యువత ఫిదా అయిపోయింది. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే రాధిక నటించిన న్యూడ్ సీన్స్ లీకై పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. ఆమె నటించిన సీన్స్ లీకయి పెద్ద దుమారమే రేపింది.ఆమె చేసిన పాత్రలు మరీ బోల్డ్ గా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలు తీయడం, వాటిలో నటించడం మంచిది కాదని తప్పని ఆమెపై పలువురు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో ఆ విమర్శలు హద్దులు దాటి మరీ ఇబ్బందికరంగా ఆమె గత జీవితాన్ని టార్గెట్ చేసే తారాస్థాయికి చేరుకొన్నాయి. అయినా కూడా రాధికా ఆప్టే ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు.
మరో దుమారానికి రెడీ అయిందట రాధికా. తాజాగా బొంబైరియా అనే సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది? ఈ సినిమాలో ఓ స్టార్ హీరోతో సన్నిహితంగా, అతని విషయాలు చూసుకునే పాత్రలో కనిపిస్తుందని, ఆమెకు, హీరోకి మధ్య నడిచే వ్యక్తిగత విషయాలపై ఈ సినిమా ఉంటుందట, అతనితో రొమాన్స్ చేస్తున్న సన్నివేశాలు ఫోన్ లో ఉంటాయని, ఆ ఫోన్ ను ఓ దొంగ దొంగిలిస్తాడట, అందులో ఉన్న ఆ వీడియోలు లీక్ అయితే ఎలా ఉంటుంది అన్న కథతో ఈ సినిమా నడుస్తుందట!! అంటే ఈ సినిమాలో కూడా రాధికా ఆప్టే బోల్డ్, అండ్ బెడ్ సీన్స్ చాలానే ఉంటాయని చిత్రయూనిట్ చెబుతోంది. దీంతో మరోసారి బొంబైరియాతో ఈ అమ్మడు ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి.