చెర్రి కోసం కేటీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా…

97
KTR for Ram Charan

ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హడావుడి షురూ అయింది. రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ఆడియో వేడుక అయినా.. ఇంకే కార్యక్రమం అయినా.. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవే ముఖ్య అతిథిగా వస్తుంటారు. ఐతే ఈసారి మాత్రం ఓ విశిష్ట అతిథి చరణ్ సినిమా వేడుకలో సందడి చేయబోతున్నాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి.. కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. ధృవ ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన మరికొంతమంది హీరోలు కూడా ఈ వేడుకకు హాజరవుతారు. ‘ధృవ’ ఒక పోలీస్ స్టోరీ కావడంతో ప్రి రిలీజ్ వేడుకకు వేదికను కూడా అందుకు తగ్గట్లే ఎంచుకున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. ఐతే ఎంతమంది వచ్చినా.. చరణ్ సినిమా వేడుకకు కేటీఆర్ రావడమే అతి పెద్ద విశేషం.

KTR for Ram Charan

‘ధృవ’ ప్రి రిలీజ్ వేడుకను డిసెంబరు 4న హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లో జరగనుంది.ఈ మధ్య తెలుగు ఫిలిం సెలబ్రెటీలతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు కేటీఆర్. తరచుగా సినిమా వాళ్లతో మీటింగ్స్ పెడుతూ.. పరిశ్రమ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాడు. రామ్ చరణ్ తో కేటీఆర్ కు మంచి సాన్నిహిత్యమే ఉంది. ఆ మధ్య 10 కే రన్ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఐతే టాలీవుడ్లో ఓ పెద్ద సినిమా వేడుకకు కేటీఆర్ హాజరవడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అరవింద స్వామి కీలక పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

KTR for Ram Charan