ఆ సీన్స్‌ తీయాలంటే..అది తప్పదు:రాధిక సంచలనం

530
radhika apte
- Advertisement -

రాధికా ఆప్టే … ఈ పేరు వింటే చాలు .. ఆమె రేపే సంచలనాలే గుర్తుకు వస్తాయి.తెలుగు, తమిళ్, హిందీ, మరాఠి వంటి భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ…కొంతకాలంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. న్యూడ్, సెమి న్యూడ్ అంటూ హంగామా క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కమర్షియల్ హీరోయిన్ గా అంత పెద్దగా సక్సెస్ కాలేకపోయిన రాధికా… బోల్డ్ కాన్సెప్ట్ సినిమాలకు పెద్దపీట వేసి కుర్రకారును షేక్ చేసింది.

బోల్డ్ సినిమాలే కాదు తన బోల్డ్ మాటలతో సైతం సంచలనాలకు కేరాఫ్‌గా మారిన రాధిక తాజాగా మరో ఆసక్తిర విషయాన్ని బయటపెట్టింది. బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ నేహా ధూపియా నిర్వ‌హిస్తున్న ఓ టాక్ షోలో ప‌లు హాట్ హాట్ ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానమిచ్చింది.

రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఎప్పుడైనా ఫీలింగ్స్ క‌లిగిన‌ సందర్భాలున్నాయా అంటూ నేహా…రాధికను ప్రశ్నించగా అఫ్‌కోర్స్‌.. అది స‌హ‌జం. నా కెరీర్‌లో అలాంటి ఘ‌ట‌న‌లు ఉన్నాయని చెప్పేసింది. అలాంటి సన్నివేశాల్లో ఫీల్ అయితేనే ఆ సీన్ సహజంగా వస్తుందని తెలిపింది. ఎవ‌రితోనైనా ప్రేమ‌లో ప‌డ్డావా అనే ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. షూటింగ్ స‌మ‌యాల్లో నాకు ఎదురైన చాలా మంది వ్య‌క్తులు న‌న్ను ఆక‌ర్షించారు. అందులో కొంత మంది నా మ‌న‌సుకు న‌చ్చారు. వారితో ప్రేమ‌లో ప‌డ్డానని నిర్మోహమాటంగా చెప్పుకొచ్చింది రాధికా.

- Advertisement -