చింతమడకకు సీఎం కేసీఆర్

600
kcr chinthamadaka
- Advertisement -

సీఎం కేసీఆర్ త్వరలో తన స్వగ్రామం చింతమడకలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే హరీష్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వగ్రామానికి చాలా రోజుల తరువాత వస్తున్నట్లు తెలిపారు. సీఎం టూర్ నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నారు.

గ్రామ సమస్యలపై అధికారులతో, ప్రజలతో సమీక్షి నిర్వహిస్తారని చెప్పారు. గ్రామస్తులతో కల్సి సహపంక్తి బోజనం చేస్తారని,గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయాన్ని సందర్శిస్తారని చెప్పారు.

గ్రామంలో భూమి లేని నిరుపేదలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. త్రాగు నీటి సౌకర్యం , ఇతరత్రా వసతులపై పలు శాఖ అధికారులకు సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చింతమడక గ్రామంలో ఉన్న చెరువులు, కుంటల కాలువల అనుసంధానం చేసే మ్యాప్ ను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -