- Advertisement -
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ప్రభాస్ సరసన పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకువచ్చింది. దశాబ్దం తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన ఈ ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో రికార్డు ఓపెనింగ్స్ సాధించింది.
హాలీవుడ్ సినిమాలతో పోటీపడి ప్రీమియర్‌లోనే 904 K డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికాలో మరికొన్ని స్క్రీన్స్ యాడ్ చేశారు. ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్‌తో వచ్చిన ప్రేమ కథ మరొకటి లేదు.
తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరింత ప్లస్ కాగా విజువల్స్,నిర్మాణ విలువలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
- Advertisement -