ప్రభాస్…రాధేశ్యామ్‌ @ 3.8 మిలియన్ ట్వీట్స్

256
radheshyam
- Advertisement -

సాహో తర్వాత ఫ్యాన్స్‌కు అదిరిపోయే కిక్ ఇచ్చారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్ అనే టైటిల్ ఖరారు చేయగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ఫస్ట్ లుక్‌తో మంచి ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్.

రాధేశ్యామ్ ఫస్ట్ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో రాధేశ్యామ్ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 3.8 మిలియన్ ట్వీట్స్‌తో ట్రెండింగ్‌గా మారింది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా వీరిద్దరి లుక్ అందరిని ఆకట్టుకుంటోంది.

గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది

- Advertisement -