ఆసీస్‌తో వన్డే సిరీస్..రబాడా ఔట్!

8
- Advertisement -

దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో ఆగస్టు 19న వన్డే సిరీస్‌ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలర్ రబాడా సిరీస్‌కు దూరమయ్యాడు.

కుడి కాలి మడమలో వాపు కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. 30 ఏళ్ల రబాడా సోమవారం (ఆగస్టు 18) స్కాన్ చేయించగా, గాయం తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. క్రికెట్ సౌతాఫ్రికా తెలిపిన ప్రకారం, ఆయన ఇకపై ఆస్ట్రేలియాలోనే ఉండి, జాతీయ జట్టు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు.

కెయిన్స్‌లో జరగబోయే మొదటి మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా లుంగి ఎంగిడి, నాండ్రే బర్గర్, వియాన్ ముల్డర్‌లను ఎంపిక చేసింది. తర్వాతి రెండు మ్యాచ్‌లు ఆగస్టు 22, 24 తేదీలలో మకేలో జరగనున్నాయి.

Also Read:తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

- Advertisement -