- Advertisement -
సినీ నటులు, రచయిత రావి కొండలరావు(88) ఇకలేరు. కన్నుమూశారు. బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 600కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు. 1965లో చదువు పూర్తి చేసి.. ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా శ్రీశ్రీ, ఆరుద్రలతో కలిసి పనిచేశారు. రావి కొండలరావు భార్య రాధా కుమారి కూడా ఆయనతో కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఆమె 2012లో మరణించారు.
ఇక నాటకరంగం నుంచి దాగుడు మూతలు సినిమాతో నటుడిగా మారారు. రాముడు భీముడు, తేనెమనసులు, ప్రేమించి చూడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. చివరిగా ఆయన 365 డేస్ చిత్రంలో నటించారు.
- Advertisement -