ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్లో ఆరంగేట్రం చేసింది ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రహీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసిన రాశీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైంది రాశీ. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగు నేర్చుకుంది. ఇక నుంచి తన పాత్రలకు డబ్బింగ్ తానే చెప్పుకుంటానని చెప్పింది.
తన కెరీర్లో కోసం బరువు కూడా తగ్గింది రాశీ. రీసెంట్ మూవీల్లో బొద్దుగా కనిపించిన రాశీ…వరల్డ్ ఫేమస్ లవర్ సన్నబడి ఫ్యాన్స్‌కు మరింత చేరువయింది. తనకు ఫిట్ నెస్‌గా ఉండటం అంటే ఇష్టమని…అందుకే స్లిమ్,ఫిట్‌గా ఉన్నానని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్లో తాను కంఫర్ట్ జోన్లో ఉన్నానని…బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది.
వరల్డ్ ఫేమస్ లవర్‌తో పాటు రాశీ నటించిన వెంకీమామ త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాయి.
Raashi Khanna has started dubbing her voice in Telugu. She has learned the language fluently and is now mouthing her dialogues on her own