దర్శకుడితో ఎఫైర్..క్లారిటీ ఇచ్చిన రాశి..

223
Raashi Khanna Responds on about Rumours
- Advertisement -

తనలో ఎన్నడు చూడని కొత్త బ్యూటీని టాలెంట్ ని తొలిప్రేమ సినిమాలో చూపించిన రాశి ఖన్నా ఫుల్ హ్యాపీగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఒక పెద్ద హిట్ అందుకున్న ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తోంది. సరిగ్గా దానికి వారం ముందు వచ్చిన టచ్ చేసి చూడు ఫలితం కొంత టెన్షన్ పెట్టినా తక్కువ టైంలోనే తొలిప్రేమ దానిని కవర్ చేయటంతో ఇప్పుడు రిలాక్స్ గా ఉంది. ఈ నేపధ్యంలో తన మీద గతంలో వచ్చిన పుకారు గురించి స్పందించింది రాశి ఖన్నా.
Raashi Khanna Responds on about Rumours

‘సుప్రీమ్’ సినిమాతో తనకి అనిల్ రావిపూడి హిట్ ఇవ్వడం వలన, ఆయన తదుపరి సినిమా అయిన ‘రాజా ది గ్రేట్’ లో స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేశాను. దాంతో అనిల్ రావిపూడితో ముడిపెడుతూ కొంత మంది ప్రచారం చేశారు. అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు కావడం వలన .. నాకు మరో స్నేహితుడైన రవితేజ మూవీ కావడం వలన ఆ సినిమాలో ఆ సాంగ్ చేశాను .. అంతకి మించి మరేమీలేదు. ఇలాంటి పుకార్లు బాధ కలిగించడం లేదు గానీ .. లేని విషయాన్ని ప్రచారం చేసేవారి తీరే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంది. నితిన్ జోడీగా ‘శ్రీనివాస కల్యాణం’ మూవీ కోసం ఆమె ఎంపికైన సంగతి తెలిసిందే.

- Advertisement -