వెంకీతో నితిన్‌..!

218
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇటీవల థియేటర్స్ కి వచ్చిన ‘ఛలో’ సినిమా, తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోను భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఈ సినిమాకి యూత్ నుంచి వచ్చిన ఆదరణ చూసిన హారిక అండ్ హాసిని బ్యానర్ వారు వెంకీ కుడుములతో నితిన్‌ హీరోగా ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నితిన్‌ను పర్సనల్‌గా కలిసి ఛలో సినిమాను చూపించి నితిన్ మెచ్చుకోవడం గురించి ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు వెంకీ కుడుముల.

Director Venky Kudumula to Work With Nithin

ఇక నితిన్ గతంలో అఆ కోసం హారికా హాసిని సంస్థతో అసోసియేట్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న చల్ మోహనరంగా తర్వాత హారికా హాసిని బ్యానర్ సిస్టర్ కన్సర్న్ గా ఉన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ కోసం నితిన్ డేట్స్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ స్లాట్ లో వెంకీ కుడుములతో నితిన్ హీరోగా సినిమా చేయించే దిశగా చర్చలు జరుగుతున్నాయి అని టాక్. వెంకీ కూడా కథను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడట. తన బలమైన కామెడీ టైమింగ్ ని మిస్ కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సిద్ధం చేస్తున్నట్టు టాక్.

ఇది జరిగితే వెంకీ కుడుముల దశ తిరిగినట్టే. హారికా బ్యానర్ లో నిర్మాణ విలువలు త్రివిక్రమ్ శిష్యుడిగా వెంకీకి తెలియనిది కాదు. సో అది దృష్టిలో పెట్టుకునే స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. నితిన్ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని తెలిసింది. లై దెబ్బ తర్వాత స్క్రిప్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్న నితిన్ చల్ మోహనరంగా విడుదలయ్యే లోపు దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

- Advertisement -