వరుణ్ తో రాశీ రొమాన్స్

220
Raashi-Khanna
- Advertisement -

నెల రోజుల కింది వరకు వరుణ్‌ తేజ్‌ నెక్ట్స్ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. దానికి కారణం ఈయన ప్లాపుల్లో ఉండడమే. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఫిదా సినిమాతో ఈయన పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కొట్టేశాడు. కెరిర్‌లో తొలి బ్లాక్ బస్టర్‌ కాబట్టి ఇంకా ఆ ఎమోషన్‌లోనే ఉన్నాడు వరుణ్‌ తేజ్‌.  ఆ విజయం ఇంకా కంటిన్యూ అవుతుండగా, మరోవైపు తన తదుపరి సినిమాపై కూడా దృష్టి పెట్టాడు ఈ హీరో.

Varun Tej, Rashi Khanna film launched

ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీన్లను చిత్రీకరించినట్లు తెలుస్తుంది.తదుపరి షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక రొమాంటిక్‌ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్‌ సరసన రాశిఖన్నా నటిస్తుండగా, బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు.

Varun Tej, Rashi Khanna film launched

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా. త‌క్కువ సినిమాలే చేసినా త‌న‌కంటూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది ఈ అందాల‌భామ‌.ఎన్టీఆర్ సరసన ‘జై లవ కుశ’ నటిస్తూనే రవితేజ‌ తో ‘టచ్ చేసి చూడు’ చిత్రంలోనూ సంద‌డి చేస్తోంది.  వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ప్రేమకథా చిత్రంగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌ నటించిన ఫిదా చిత్రం మంచి బ్లాక్ బ్లస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మొత్తానికి చూడాలి.. మరి .. వరున్‌ తేజ్ మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంటాడో లేదో చూడాలి.

- Advertisement -