తెలుగబ్బాయిని పెళ్లిచేసుకుంటా..!

263
Raashi Khanna
- Advertisement -

అందమైన నవ్వుతో తెలుగుతెరపై సందడి చేస్తున్న ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన ఈ సుందరి రాశి, వాసిలోనూ ప్రతిభను చాటుతూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నితిన్‌తో శ్రీనివాస కల్యాణంలో నటించిన రాశీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

తొలి ప్రేమ సినిమా తర్వాత మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీనివాస కల్యాణం స్టోరీ నచ్చిందని తెలిపింది. సంప్రదాయాలకు విలువనిచ్చే సిరి అనే యువతిగా కనిపిస్తానని తెలిపింది. నితిన్‌ మంచి నటుడని…ఈ సినిమాలో నటిస్తున్నంత సేపు తెలుగమ్మాయిగా మారిపోయానని చెప్పింది. తెలుగబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది ఈ బ్యూటీ.

చాలా సమయాన్నిపుస్తకాలు చదివేందుకే.. గడిపేస్తుంటానని.. ఈ విషయంలో తన అమ్మతో కూడా.. మాటలు అనిపించుకుంటూ ఉంటానని రాశీ ఖన్నా చెప్పింది. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నావని అప్పుడప్పుడూ అమ్మ కోప్పుడుతుందని చెప్పింది. నేనెప్పుడూ జయాపజయాలను పట్టించుకోనని…. మరో మంచి సినిమా చేయాలనే విషయంపైనే నా ధ్యాసంతా ఉంటుందని తెలిపింది.

- Advertisement -