అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాకా. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా టైటిల్ రాకాను రీవిల్ చేశారు మేకర్స్. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఈ పోస్టర్‌లో ఒక నక్కలాంటిదైన పంజా (wolf-like hand) అల్లు అర్జున్ ముఖాన్ని కొంతవరకు కప్పి ఉంచడం కనిపిస్తుంది. ఆయన హాఫ్-బాల్డ్, రఫ్ లుక్ సినిమాకు ఉన్న ఇంటెన్సిటీని స్పష్టంగా తెలియజేస్తోంది.
ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశముంది.
గత ఏడాది జూన్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో దర్శకుడు అట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు చెబుతుండగా, దీపికా పదుకొణే యాక్షన్ సన్నివేశాల్లో కనిపించారు.సన్ పిక్చర్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ..ది క్వీన్ మార్చెస్ టు కాన్కర్! వెల్కమ్ ఆన్‌బోర్డ్ దీపికా పదుకొణేఅని పేర్కొంది.
Also Read:ఆధునిక వైద్యం..వ్యాధులను నయం చేయగలదా?

