ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ప్రాణాంతకంగా భావించిన అనేక వ్యాధులను ఇప్పుడు చికిత్సతో నియంత్రించడం, తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న రోగులను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడం సాధ్యమైంది. అయితే, దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వైద్యం మీ ప్రాణాలను కాపాడగలదు, కానీ అది మిమ్మల్ని పూర్తిగా నయం చేయలేదు అని వెల్లడిస్తున్నారు.
వైద్యులు హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి అత్యవసర పరిస్థితులను సమర్థంగా చికిత్స చేయగలరు. శస్త్రచికిత్సలు, మందులు, ఆధునిక టెక్నాలజీ ద్వారా రోగులను ప్రమాదం నుంచి బయటకు తీసుకురావడం వైద్య రంగానికి సాధ్యమైంది. అయితే, వ్యాధి ఎందుకు వచ్చింది? దాని మూల కారణాలు ఏమిటి? అనే విషయాలను వైద్యం పూర్తిగా పరిష్కరించలేకపోతుంది.
ఎందుకంటే..డాక్టర్లు లక్షణాలను (symptoms) తగ్గించగలరు.కానీ జీవనశైలి కారణాలను పూర్తిగా నియంత్రించలేరు. కారణం వైద్యులు మందులు ఇవ్వగలరు,శస్త్రచికిత్సలు చేయగలరు,సలహాలు ఇవ్వగలరు. కానీ మీరు ఏం తింటున్నారో చూడడం,మీరు వ్యాయామం చేస్తున్నారా అనే విషయం నియంత్రించడం,మీరు సరైన నిద్ర తీసుకుంటున్నారా అని పర్యవేక్షించడం చేయలేరు కదా.
Also Read:ఆల్కహాల్ టూ కాఫీ..గట్ హెల్త్‌కు హాని చేసేది ఏది?
హీలింగ్ అంటే కేవలం మందులు కాదు. మీరు ప్రతిరోజూ చేసే చిన్న చిన్న నిర్ణయాలే నిజమైన ఆరోగ్యాన్ని నిర్మిస్తాయి.మంచి ఆహారం,క్రమమైన వ్యాయామం,సరైన నిద్ర,మానసిక ప్రశాంతత. ఇవే ఆరోగ్యానికి అసలు బలం . ఆధునిక వైద్యం మీ ప్రాణాలను కాపాడగలదు. కానీ దీర్ఘకాల ఆరోగ్యం, సంపూర్ణ నయం మాత్రం మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

