చిరుతో ఇబ్బంది పడ్డానంటున్న రత్తాలు..

245
Raai Laxmi opens up about her bikini show
- Advertisement -

బలుపు సినిమాతో ఐటెం గర్ల్‌గా మారిన రాయ్‌లక్ష్మి ఇటీవల తౌబతౌబా దిల్లు రూబా…అంటూ సర్దార్ గబ్బర్‌సింగ్‌తో చిందేసి రచ్చచేసిన విషయం తెలిసిందే. తర్వాత ఏకంగా మెగాస్టార్ 150 మూవీలో తళుక్కున మెరిసింది. రత్తాలు రత్తాలు అంటూ రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్‌తో మాస్‌ని మెస్మరైజ్ చేసిన రాయ్ లక్ష్మీ… చిరుతో పోటీపోటీగా చిందులేసింది. ఐతే హీరోయిన్‌గా తనకు తెలుగులో కలిసి రాకపోయిన బాలీవుడ్‌లోనైనా అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న ఈ భామకు అక్కడే చిక్కులే తలెత్తాయి.

ఈ భామ ఎంతో కష్టపడి చేస్తున్న ‘జూలి 2’ విడుదల రోజు రోజుకీ వెనుకపడుతూనే ఉంది. దీనిపై ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Raai Laxmi opens up about her bikini show

‘జూలీ 2’ నా కెరీర్‌లో మరిచిపోలేని సినిమా అవుతుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ నా నటనను పూర్తి స్థాయిలో చూపించే అవకాశం రాలేదని ఈ సినిమాతో ఆ కొరత తీరిపోతుంది. నటన ఒక్కటే కాదు. ఈ సినిమాలో కొత్త రాయ్‌లక్ష్మిని చూస్తారని చెప్పింది. బికినీ వేసినా, అది సన్నివేశం పరంగా వస్తుందే తప్ప కావాలని వేసినట్టు అనిపించదని తెలిపింది.

ఇక చిరుతో డ్యాన్స్‌ అనే సరికి కంగారుపడ్డానని తెలిపింది. ఆయన వేగంతో పోటీ పడడానికి మాత్రం ఇబ్బంది పడ్డాను. తరువాత అలవాటైపోయిందని వెల్లడించింది. ఐటెం సాంగ్ చేస్తునందుకు అస్సలు బాధలేదని .. సినిమాలకు దూరమైతే బాధపడాలని తెలిపింది. దక్షిణాది హీరోయిన్లతో పోల్చుకుంటే నేను ఎక్కువగా సెల్ఫీలు పోస్ట్‌ చేస్తుంటాను. అందుకే నన్ను అందరు సెల్ఫీ క్వీన్ అంటారని వెల్లడించింది.

ఇండస్ట్రీలో నాపై వచ్చే పుకార్ల గురించి అస్సలు పట్టించుకోనని …వాటిని పట్టించుకుంటే ఈ రంగంలో ఉండడం కష్టమేనని తెలిపింది. ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఎక్కడికి వెళ్లినా వెంటనే సంబంధాలు అంటగట్టేస్తుంటారు. కొన్ని సార్లు వాటిని విన్నా, చదివినా బాధ వేస్తూంటుంది. అది కొద్దిసేపే! వెంటనే మామూలు అయిపోతానని వెల్లడించింది ఈ భామ.

- Advertisement -