పవన్‌పై ఆర్ నారాయణమూర్తి సంచలన కామెంట్

5
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆర్ నారాయణమూర్తి సంచలన కామెంట్ చేశారు. థియేటర్ల బంద్‌పై పవన్ చేసిన కామెంట్స్ సరైనవి కావు అన్నారు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజిలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారు? పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం రావాలని పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది అన్నారు.

గ‌ద్ద‌ర్ అవార్డులు ఇచ్చినందుకు గానూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. గద్ద‌ర్ అవార్డుల‌ విజేత‌ల‌కు అభినంద‌లు తెలిపారు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ నంది అవార్డులు ఇవ్వాల‌ని కోరారు.

పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. పర్సంటేజి విషయాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్ లకు వంతపాడుతున్నారు, మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి అని తెలిపారు.సినిమాలు బాగుంటే జనాలు వస్తారు… టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు అని వెల్లడించారు.

Also Read:విస్తరిస్తున్న కరోనా…జాగ్రత్త!

- Advertisement -