ఆర్‌ నారాయణమూర్తికి మాతృవియోగం

71
- Advertisement -

పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌ నారాయణమూర్తి ఇంట విషాదం నెల‌కొంది. నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం కాగా.. వారిలో మూడో కుమారుడు ఆర్‌ నారాయణమూర్తి. చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

త‌న‌దైన మార్కు సినిమాలు చేసి ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారాయ‌ణ‌మూర్తి. ముఖ్యంగా ఎర్ర‌జెండా సినిమాలు, ప్ర‌జ‌ల క‌ష్టాల నేప‌థ్యంలో సినిమాలు చేశారు.

- Advertisement -