తాజాగా ఆర్.నారాయణ మూర్తి స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అన్నదాత సుఖీభవ. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమాను సెన్సార్ కోసం పంపగా అందులో ప్రధానంగా తీసిన సీన్లను సెన్సార్ బోర్డు కట్స్ చెప్పింది. సమాజంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకోని అన్నదాత సుఖీభవ ఈ సినిమా చేశానన్నారు.
అయితే ఇందులోని ప్రధాన అంశమైన ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు కానీ, రైతు అప్పుకట్టపోతే పీడిస్తారు” అనే ప్రధాన డైలాగ్ ను తీసేయాలని చెప్పడంతో నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చెప్పారు. అయితే ఈ చిత్రంలోని ప్రధానమైన అంశాలను సెన్సార్ కట్స్ చెప్పడం సరికాదని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. రైతలు, సామాన్య ప్రజల సమస్యలను, వారు పడుతున్న బాధలను తెలియజేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలు ఏం పుణ్యం చేశారు? రైతుల ఏం పాపం చేశారు? అని నారాయణ మూర్తి అన్నారు.
మరోవైపు వేల కోట్లు రూపాయలు ఎగ్గొట్టి కొందరు విదేశాలకు పారిపోతున్నారని, అమాయకపు రైతులను ఆదుకోవాలని సినిమా తీయడం తప్పా? అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు జీఎస్టీ అంటూ వేల కోట్ల రూపాయలు కడుతుంటే.. బడా పారిశ్రామిక వేత్తలకు ధారదత్తం చేయడానికా అని ప్రశ్నించారు. తాను ఈ విషయంపై సెన్సార్ బోర్డు నిర్ణయంపై పునర్విచారణ కమిటీకి వెళతాన్నారు.