నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్,బీజేపీలకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుండి అంతగా స్పందన రావడంలేదు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు ప్రజలు అపూర్వస్వాగతం పలుకుతున్నారు. పలు ప్రజాసంఘాలు భగత్‌కు మద్దతు పలకగా తాజాగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య టీఆర్ఎస్‌కు మద్దతు పలికారు.
నాగార్జున సాగర్ టికెట్‌ను బీసీలకు కేటాయించాలని తాము చేసిన విజ్ఞప్తిని సీఎం కేసీఆర్ పరిగణలోకి తీసుకుని ఉద్యమాల వీరుడు నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు కేటాయించారని పేర్కొన్నారు. బీసీలంతా భగత్‌కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి బీసీల కొత్త చరిత్రకు నాంది పలకాలని ఆయన కోరారు.
ఇప్పటికే టీఆర్ఎస్ గెలుపు నల్లేరుపై నడకే కాగా ఆర్.కృష్ణయ్య మద్దతుతో టీఆర్‌ఎస్ మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది.