ఏపీ నుండి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్ధానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు సీఎం జగన్. ఇద్దరు రెడ్లు, ఇద్దరు బీసీలకు ఛాన్స్ ఇవ్వగా ఇందులో ఇద్దరు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం. బీసీ నేత ఆర్ కృష్ణయ్య,జగన్ వ్యక్తిగత లాయ్ నిరంజన్ రెడ్డిలతో పాటు విజయసాయిరెడ్డి,బీద మస్తాన్ రావుల పేర్లు ఖరారు చేశారు.
ఎల్బీనగర్ నుండి ఆర్.కృష్ణయ్య, కావలి నుండి బీద మస్తాన్ రావు ఇద్దరూ గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు.
ఆర్.కృష్ణయ్యది వికారాబాద్ జిల్లా. మోమిన్‌పేట మండలం రాళ్లగుడుపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. బీసీ ఉద్యమ నాయకుడు. ఏలేటి నిరంజన్ రెడ్డి నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం సిర్గాపూర్‌లో జన్మించారు. 1992లో హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. నిరంజన్ రెడ్డి సీఎం జగన్‌కు వ్యక్తిగత న్యాయవాది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏపీలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గా నియమించారు. మస్తాన్ రావు,విజయ సాయిరెడ్డి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారు.