అన్‌లిమిట్‌డ్‌ ప్లాన్‌తో అన్నకు పోటీగా తమ్ముడు..

323
R-Com takes on Reliance Jio, offers unlimited voice plan for Rs149 a month
- Advertisement -

సెల్‌ఫోన్ సిమ్‌కార్డు, పోస్ట్ కార్టు కన్నా తక్కువ ధరకు వస్తుందని దీరూభాయ్ అంబానీ చెప్పేవారు. అప్పట్లో ఆయన మాటలు విని అందరూ నవ్వుకునేవారు. ఆ మాటలను ఇప్పుడు ఆయన కొడుకులు నిజం చేశారు. ఆయన కుమారుడు ముఖేష్ అంబానీ అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్‌ ఇంటర్నెట్‌తో జియో ప్రవేశపెట్టి టెలీకమ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం ఆల్ ఫ్రీ అంటూ మరో విప్లవానికి తెరతీశారు. ఇపుడు అన్న ముకేష్ అంబానీకి పోటీగా తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ కూడా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

Telecom11

రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) రూ. 149కే అపరిమిత కాలింగ్ ప్లాన్ను మంగళవారం లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ టెలికాం నెట్వర్క్కైనా, ఏ మొబైల్ నుంచైనా అపరిమిత కాలింగ్ టాక్ టైమ్ సద్వినియోగం చేసుకునేలా ఈ ప్లాన్ దోహదం చేయనుంది. ఎక్కువ దూరం చేసే కాల్స్కు కూడా ఈ ఫ్లాన్ ఉపయోగపడనుంది. దీనికోసం వినియోగదారులు నెలకు రూ.149 చెల్లిస్తే చాలని కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాన్పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు 300 ఎంబీ డేటా వాడకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చని ఆర్‌కాం పేర్కొంది. లక్షల కొలదీ భారతీయులు తమ అన్లిమిటెడ్ ప్లాన్తో లబ్దిపొందనున్నట్టు ఆర్కామ్ కన్సూమర్ బిజినెస్ సీఈవో, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కో-సీఈవో గుర్దీప్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు.

కాగా, సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ జియో సేవలు అఫీషియల్‌గా ప్రారంభం అయ్యాయి. ముందుగా పేర్కొనట్టు మూడు నెలలపాటు కాకుండా నాలుగు నెలలపాటు అంటే, డిసెంబర్ 31 వరకు ఉచితంగా వాయిస్, డేటా సేవలను అందించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు.  డిసెంబర్ 31 తరువాత కొన్ని ప్యాకేజీలు ప్రకటించారు. అవి ఇలా ఉన్నాయి.

ఎస్ ప్యాకేజీ: రూ. 149 టారిఫ్‌తో 0.3 జీబీ డేటా, రోజుకు 100 ఫ్రీ మెసేజ్‌లు అందిస్తారు. జియో నెట్‌వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు.

R-Com takes on Reliance Jio, offers unlimited voice plan for Rs149 a month

ఇతర ఆఫర్లు

– ఈ డిసెంబర్ 31 తర్వాత నూతన డేటా ప్లాన్లు అందుబాటులోకి వస్తాయి. రూ.50కే 1 జీబీ ఫ్రీగా డేటా అందిస్తారు.
– నో బ్లాక్ డేస్
– దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్
– స్టూడెంట్స్ కోసం అదనంగా 25 శాతం డేటా
– ప్రీమియం యూజర్ల కోసం 135 ఎంబీపీఎస్ వేగంతో డేటా అందించడం
– ప్లాటినం యూజర్లు వీడియో ద్వారా కస్టమర్ కేర్‌తో మాట్లాడే సదుపాయం
– రూ.2999కే 4జీ ఫోన్
– 2జీ, 3జీ మొబైల్ ఫోన్ల కోసం రూ.1999కే వైఫై కోసం జియోఫై రౌటర్లు

- Advertisement -