ముక్కుసూటిగా మాట్లాడే స్వభావంతో బీ టౌన్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. అయితే..ప్రస్తుతం మణికర్ణిక చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న కంగనా..అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించబోతోంది.
‘ప్యాడ్ మ్యాన్’ తర్వాత ఆర్ బల్కీ దర్శకత్వం వహించబోతున్న చిత్రంలో కంగనా, బిగ్ బీ , ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఇందులో కంగనా రనౌత్ వికలాంగురాలి పాత్ర పోషిస్తుండగా, ఆమెకు మెంటార్‌గా అమితాబ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఆర్ బల్కీ చిత్ర షూటింగ్ ప్రారంభానికి ముందు వికలాంగురాలిగా నటించడం కోసం కంగనా కొంత హోం వర్క్ చేయాల్సి ఉంది. అందుకోసం ఆమె దాదాపు రెండు నెలల సమయం తీసుకోనుందట. అలాగే ఎవరెస్ట్ అధిరోహించిన వికలాంగురాలు అరుణిమ సిన్హా జీవితకథలో కంగనా నటించబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పట్లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కేలా కనిపించకపోవడంతో బల్కీ సినిమా కోసం తీసుకోబోయే శిక్షణ ఆ సినిమాకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.