ముస్లింలకు 12 శాతం తథ్యం..:కేసీఆర్

186
Quota for Muslims at any cost
- Advertisement -

వందశాతం ముస్లిం రిజర్వేషన్లు సాధించి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో మైనార్టీ సంక్షేమంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్… ముస్లింలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించితీరుతామన్నారు. రిజర్వేషన్లను రాజకీయడం చేయడం లేదని టాస్క్‌గా తీసుకున్నామని తెలిపారు.

ముస్లింల రిజర్వేషన్‌ అంశం కేంద్రం  పరిశీలనలో ఉందని..ప్రధాని నరేంద్రమోడీ సానుకూలంగా ఉన్నారన్నారు. వందశాతం ముస్లిం రిజర్వేషన్ సాధించి తీరుతమన్నారు. ముస్లింలలో ధనికులున్నారు..పేదలున్నారు. ముస్లింలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. మైనార్టీలకు కాంగ్రెస్‌ హయాంలో కంటే మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. తమిళనాడు తరహాలోనే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. వచ్చే  శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై ఎంపీలు పోరాటం చేస్తారన్నారు.

తెలంగాణ తెచ్చి నవిధంగానే రిజర్వేషన్లు సాధిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో రూ.932 కోట్లు ఖర్చు చేస్తే..టీఆర్ఎస్ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎందుకు వెనక్కివెళ్లిందని ప్రశ్నించారు సీఎం.

- Advertisement -