ఒగ్గు.. ‘చుక్క’ ఇక లేరు

567
Oggu Katha Chukka Sattaiah is no more
- Advertisement -

ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య  కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్తయ్య స్వగ్రామం మాణిక్యపురంలో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ జానపదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఒగ్గుకళే సర్వస్వంగా భావించాడు. తుదిశ్వాస ఉన్నంత వరకు ఆ కళనే అంటిపెట్టకుని ఉన్నాడు. దాన్ని అంటిపెట్టుకున్నవాళ్లను చేరదీసి జట్టుకట్టి ఆడిండు,ఆడించిండు. చుక్కసత్తాయ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం గ్రామంలో చౌదరిపల్లి ఆగయ్య, సాయమ్మ దంపతులకు 15జూన్ 1936 సంవత్సరంలో జన్మించారు. 11 ఏళ్ల వయస్సులోనే పెళ్ళి చేసుకున్నారు. ఒకటో తరగతి వరకే చదువుకున్నా రు. తన ప్రతిభా పాటవాలతోనే ఒగ్గు కథను రక్తికట్టించేటట్లు చేసిండు.  దేశవ్యాప్తంగా సుమారు 12 వేల ప్రదర్శనలు ఇచ్చిన సత్తయ్య మాజీ ప్రధాని ఇందిరాతో సన్మానాన్ని అందుకున్నారు. ఇంటిపేరు చౌదరిపల్లి అయినా ఆయనను ఎవరు కూడా ఇంటి పేరుతో పిలువలేదు. నుదట రెండు పాదాల మాదిరిగా (చుక్క) ఉంది. ఆ ‘చుక్క’ సత్తయ్య ఇంటి పేరుగా మారింది.

Oggu Katha Chukka Sattaiah is no more
కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ ఆచార్య వంగాల గోపాలడ్డి చుక్క సత్తయ్య కళానైపుణ్యాన్ని గుర్తించి 2005లో విశ్వవిద్యాలయం ద్వారా ‘గౌరవ డాక్టరేట్’ అందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం అవార్డుతో సత్కరించింది. 2004లో భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు రూ.50వేల నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికీ తన సొంత ఊరు మాణిక్యాపూర్‌లో రెండు, మూడు ఒగ్గు కథ బృందాలు ప్రదర్శనలిస్తున్నాయి.  చుక్క సత్తయ్య జీవనం, ఒగ్గు కథ ప్రదర్శన విధానంపైన ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధన లు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం సత్తయ్యకు ప్రతి నెల రూ.10వేల పింఛను అందిస్తోంది.

మల్లన్నకథ, బీర ప్ప కథ, ఎల్లమ్మకథ, మాందాలు కథ, నల్ల పోషమ్మ కథ, కీలుగుర్రం కథ, లక్ష్యాగృహం కథ, పెద్దిరాజు కథ, ఎర్రగొల్ల అక్కమ్మకథ, కనకతార కథ, కాంభోజరాజు కథ, అల్లిరాణి కథ, గయోపాఖ్యానం, రంభ రంపాలా, అయిదు మల్లెపూల కథ, గౌడ పురాణం, సమ్మక్క కథ, మండోదరి కథ, ఇప్పరాపురిపట్నంకథ, సూర్యచంవూదాదుల కథ, బాల నాగమ్మ కథ, సత్యహరిశ్చంద్ర మహారాజు కథ, సత్యవతి కథ, సిరికొండ మహారాజు కథ, రామాయణం, మయసభ, కంసవధ, భస్మాసుర వధ, భక్త ప్రహ్లాద ఆయన చెప్పిన కథల్లో  ప్రధానమైనవి.

- Advertisement -