వరంగల్‌కు మరో ఐటీ కంపెనీ..!

590
ktr
- Advertisement -

వరంగల్‌ ప్రజలకు గుడ్ న్యూస్. మరో ఐటీ కంపెనీ వరంగల్‌కు రాబోతుంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన టెక్ మహీంద్రా,సైయెంట్ తమ బ్రాంచీలను వరంగల్‌లో ఏర్పాటు చేయగా తాజాగా క్వాడ్రంట్ రిసోర్స్ ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ రాబోతుంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్.

ఈ నెల 16న క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్‌ చేశారు. క్వాడ్రంట్‌ రిసోర్స్‌ సెంటర్‌ను 1.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. దీని ద్వారా స్థానికంగా 500 మందికి ఉపాధి లభించనుందని..క్వాడ్రంట్‌ వ్యవస్థాపకుడు, సీఈవో వంశీరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

ఇప్పటికే కేటీఆర్‌ చొరవతో మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ కూడా వరంగల్‌లో తన కార్యకలాపాలను సాగించేందుకు ముందుకొచ్చింది. ఐటీ కంపెనీల రాకతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభించే అవకాశం ఉంది.

- Advertisement -